Breaking News

గోపీచంద్ ‘సిటీమార్’ ఓటీటీ డేట్

1 0

గోపీచంద్ హీరోగా నటించిన ‘సిటీమార్’ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆంధ్రా మహిళా కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ నటించగా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూర్చాడు.