Breaking News

ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

2 0

శుక్రవారం వినాయక చవితి నేపథ్యంలో ఇప్పటికే వాడవాడలా హడావిడి నెలకొంది. పలు నగరాల్లో రోడ్లు కూడా గణేష్ విగ్రహాల కొనుగోళ్లతో రద్దీగా మారాయి. వీధుల్లో అయితే గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో పోటీలు పడుతుంటారు. కానీ ఇంట్లో పూజించే వినాయకుడి ఎత్తు ఎంత ఉండాలో చాలా మందికి తెలియదు. బహిరంగ ప్రదేశాల్లో ఎంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా ఫర్వాలేదు.

కానీ ఇళ్లలో పెట్టుకునే గణేష్ విగ్రహాల సైజు విషయంలో మాత్రం ప్రతిఒక్కరూ వాస్తు ప్రకారం కచ్చితంగా నియమాలను పాటించాల్సిందే. ఇళ్లల్లో 18 ఇంచులు లేదా ఒకటిన్నర అడుగు కన్నా ఎత్తు ఎక్కువగా ఉన్న గణేష్ విగ్రహాన్ని పెట్టి పూజించరాదు. అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే గణేష్ విగ్రహాన్నే ఇంట్లో పెట్టి పూజించాలి. పేరు, డాబు కోసం ఇళ్లలోనూ ఎక్కువ ఎత్తు విగ్రహాలు పెట్టి పూజిస్తే అనుకున్న ఫలితం దక్కదని పలువురు వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.