Breaking News

ఏపీ: అవ్వా తాతల్లో పెన్షన్ కలవరం.. !!

0 0

ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. నిమ్మగడ్డ రమేష్, మరి కొందరు టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల ఫలితంగా రాష్ట్రంలోని అవ్వాతాతలను పింఛన్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ కనిపించడం లేదు. ‘వాలంటీర్ వచ్చి డబ్బులిస్తే మందులు… పప్పు ఉప్పు… సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు… చేతిలోకి పైసలు పడలేదు.. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో’ అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేతల కారణంగా వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం..ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతే కొంత పెనాల్టీ విధిస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే. అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అవ్వాతాతలు బహిరంగంగానే బాబుకు ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా వైసీపీకి ఓటు వేసి మరోసారి జగన్ ను గెలిపించుకుంటామని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులను ఇంత మానసిక క్షోభకు గురి చేసిన నేత చంద్రబాబు మాత్రమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.