Breaking News

‘ప్రేమలు’ ఓటీటీ తెలుగు వెర్షన్ హాట్‌స్టార్‌లో కాదు..!!

1 0

మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘ప్రేమలు’ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చేశారు. మార్చి 8న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే… ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ‘ఆహా వీడియో’ సొంతం చేసుకుంది. మలయాళ వెర్షన్ సహా తమిళ హక్కులు మాత్రమే డిస్నీ హాట్‌స్టార్ దగ్గర ఉన్నాయి. ఏప్రిల్ 12న ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.