ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దేశంలోని తాజ్ హోటల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించాయని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ జంటలకు దేశంలోని తాజ్ హోటళ్లలో ఎక్కడైనా ఏడు రోజుల పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నారని దాని సారాంశం. సదరు మెసేజ్‌లో‘నేను తాజ్ హోటల్ నుంచి గిఫ్ట్ కార్డు పొందాను. ఏడు రోజుల పాటు తాజ్ హోటల్లో ఉండబోతున్నాను. మీరు కూడా తాజ్ హోటల్లో ఉండాలనుకుంటే కింద ఉన్న కూపన్‌ను క్లిక్ చేయండి’అని ఉంది. దాన్ని క్లిక్ చేయగానే.. ఈ సందేశాన్ని వాట్సాప్‌లో ఐదు గ్రూపులకు, 20 మందికి పంపించాలని నిబంధన ఉంది. దీనిపై తాజ్ హోటల్స్ యాజమాన్యం స్పందించింది. అలాంటి ఆఫర్ తాము ప్రవేశపెట్టలేదని.. ఇది నకిలీ వార్త (ఫేక్ న్యూస్) అని స్పష్టం చేసింది. అనవసరంగా ఇలాంటి లింకులు క్లిక్ చేసి మోసపోవద్దని హెచ్చరించింది. ఇదే విషయమై ముంబై సైబర్పో లీసులు కూడా ఓ హెచ్చరికను జారీ చేశారు.
గమనిక: ఈ న్యూస్‌ను మీ సన్నిహితులు, స్నేహితులకు షేర్ చేసి అలర్ట్ చేయండి.
