Breaking News

‘ఉప్పెన’ ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది

0 0

ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ఉప్పెన’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 12న విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఎంతో ప్లస్ అయ్యాయి. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో విజయ్ సేతుపతి తన విలనిజంతో అదరగొట్టాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లకు ‘ఉప్పెన’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.