Breaking News

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

0 0

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజును రాంబిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఓ వార్డు సభ్యుడు అల్లుడిని మూడురోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.