పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో చాన్నాళ్ల తర్వాత పవన్ ఖాతాలో హిట్ పడింది. అంతేకాకుండా పవన్‌కు తొలిసారిగా రూ.100 కోట్ల షేర్ వసూళ్లను అందించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి తెలుగులో ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాతి స్థానంలో నిలిచింది. ఇందులో ఓజస్ గంభీర పాత్రలో పవన్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. తమన్ సంగీతం కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే వచ్చిన ఒక్కరోజులోనే నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ స్థానంలో స్ట్రీమింగ్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే సమయంలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీంతో పవన్ రేంజ్‌ను ఓజీ మూవీ చాటి చెప్తోందని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో ఓజీ ప్రభంజనమే సృష్టిస్తోంది. త్వరలో ఓజీ పార్ట్-2 తెరకెక్కనుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని ఓజీ సినిమా చివర్లో స్పష్టం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఓజీ-2లో పవన్ నటిస్తారని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
