Breaking News

గుంతకల్లులో ‘శుభప్రదం’ మెగా షాపింగ్ మాల్

1 0

శుభప్రదం.. ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, రితికా నాయక్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్ లోని ఐడీబీఐ బ్యాంక్ ఎదురుగా బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుంతకల్లు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నంగినేని భవానీ హాజరయ్యారు. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడంతో షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్యే జయరాం, మున్సిపల్ చైర్ పర్సన్ భవానీ శుభాశీస్సులు తెలియజేశారు.

నమ్మకమైన నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ఉత్తమ సేవలను, అదిరిపోయే కలెక్షన్స్, అద్భుతమైన ఫ్యాషన్ ను శుభప్రదం అందిస్తుందని శుభప్రదం షాపింగ్ మాల్ నిర్వాహకులు సత్తిబాబు, సునీత, ప్రసాద్ తెలియజేశారు. గుంతకల్లు పట్టణంలో తమ ఫస్ట్ స్టోర్ ఏర్పాటుపై అల్లకాస్ సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మెగా షాపింగ్ మాల్ గుంతకల్లు ప్రజల ఫ్యాషన్, జీవనశైలిని మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. అందుబాటులో ఉండే ధరలలో అదిరిపోయే ఆఫర్లతో శుభప్రదం షాపింగ్ మాల్ ప్రజలకు ఆహ్వానం పలుకుతోందని అన్నారు. శుభప్రదంతో.. మీ ప్రతికార్యం జయప్రదం అవుతుందని.. మీ పరివారం ఇక శుభప్రదం కానుందని స్పష్టం చేశారు.