ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే దందాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కేబుల్ వ్యవస్థ కబ్జా చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. ఈ ప్లాన్‌కు సృష్టికర్త ఎవరో కాదు గతంలో టీవీ9 ఛానల్ హెడ్ రవిప్రకాష్. ప్రస్తుతం ఆయన ఆర్టీవీలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి తెర వెనుక నుంచి పలు విషయాల్లో సూత్రధారిగా పనులు నడిపిస్తున్నాడు. దీంతో కేబుల్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికి కావాల్సిన డబ్బును టీడీపీ ఎంపీ సమకూరుస్తున్నట్లు సమాచారం అందుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రవిప్రకాష్ వెనుక ఉన్నారని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తతంగంలో కీలక భాగస్వామిగా మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు ఉండేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు వినికిడి. ఇప్పటికే వీళ్లంతా కలిసి లోకేష్‌ను కలిసి ప్లాన్‌ను చెప్పారని.. వీళ్లతో వైసీపీ నుంచి వచ్చిన గౌరీశంకర్ కూడా ఈ కుట్రలో భాగమై సహకారం అందజేస్తున్నాడు. ఇప్పటికే లోకేష్‌ను గౌరీశంకర్ కలిసి పూలబొకే కూడా సమర్పించినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు లీకయ్యాయి.
ప్రస్తుతం ఏపీలో60 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 40 లక్షల కలెక్షన్లపై లోకేష్ కోటరీ కన్ను పడింది. కేబుల్ కబ్జాలో భాగంగా వీళ్లంతా కలిసి తొలుత కొన్ని ఛానళ్లను బాయ్ కాట్ చేయనున్నారు. ఎక్కువ మంది చూసే టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ లాంటి ఛానళ్లు ఆగిపోవడం వల్ల కేబుల్ ఆపరేటర్లకు నష్టం వస్తుంది. అప్పుడు నష్టాల్లో ఆయా ఛానళ్లను నడపటం కష్టం అని మాయమాటలు చెప్పి మెల్లగా వాటిని స్వాధీనం చేసుకునేందుకు లోకేష్ కోటరీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ తమ మాటవినకపోతే బలవంతంగా అయినా ఆయా ఛానళ్లను స్వాధీనం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇలా చేస్తేనే తమ ప్రభుత్వ నియంత్రణలో సదరు న్యూస్ ఛానళ్లు ఉంటాయని రవిప్రకాష్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తతంగం నడిపించాలంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కూడా తనకు అప్పగించాలని రవిప్రకాష్ కోరాడు. కేబుల్ వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటే చిన్నాచితకా ఆపరేటర్లు ఉండరని కూడా ఆలోచన చేస్తున్నాడు. ఇటీవల హాత్ వే రాజశేఖర్ చెందిన కేబుల్‌ను అతి చౌకగా కొట్టిసిన తరహాలోనే ఈ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేయాలని రవిప్రకాష్ తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తేనే తమకు వ్యతిరేకంగా పనిచేసే ఛానళ్లు తమ చెప్పుచేతల్లో ఉంటాయని రవిప్రకాష్ సలహా ఇచ్చినట్లు వినిపిస్తోంది. తమ మాట వినకపోతే ఆయా ఛానళ్లపై అక్రమంగా కేసులు పెట్టి వేధించేందుకు లోకేష్ కోటరీ పావులు కదుపున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే త్వరలోనే కేబుల్ వ్యవస్థ రవిప్రకాష్, కేశినేని చిన్ని, సాంబశివరావు వశం కాబోతుందని అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు కేబుల్ ఆపరేటర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.