టాలీవుడ్లో కొన్ని సినిమాలు చాలా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల ట్రైలర్ చూసినా.. పోస్టర్లు చూసినా వాటి కోసం ఎదురుచూసేలా చేస్తాయి. గతంలో నచ్చావులే సినిమాకు కేవలం కుక్కలను మాత్రమే పోస్టర్లలో చూపించి ఆ మూవీ మేకర్స్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించారు. ప్రస్తుతం ట్రైలర్‌తోనే ఓ సినిమా ఫీల్ గుడ్ అనేలా చేస్తోంది. యంగ్ హీరో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా విద్యావాసుల అహం అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా మే 17 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమాకి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఇద్దరికీ అహం ఉంటుంది. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, అభినయ కీలక పాత్రల్లో నటించారు. అహం నుంచి పుట్టిన ప్రేమకథగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. దీంతో ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను అసలు మిస్ కాకండి.