Breaking News

వినాయక పూజలో ఉపయోగించే 21 రకాల పత్రి.. వాటి వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

2 0

బాద్రపద మాసంలో జరుపుకునే వినాయకచవితి పర్వదినం చాలా విశిష్టమైనది. చవితి రోజు వినాయకుడికి పూజ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయని నానుడి ఉంది. అందుకే ఆనాడు వినాయకుడికి 21 రకాల పత్రితో నిష్టగా పూజ చేస్తుంటారు.

మాచ పత్రి: ఈ ఆకు సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతుంది. అందుకే దీని వాస‌న చూస్తే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంది.
జమ్మి: నోటి సంబంధ వ్యాధుల‌ను త‌గ్గించ‌డానికి జ‌మ్మిఆకులు మంచి సహాయకారి.
విష్ణుక్రాంత పత్రం: ఈ ఆకుల‌తో చ‌ర్మ సౌంద‌ర్యం మ‌రింత పెరుగుతుంది.
బిల్వ పత్రం (మారేడు): షుగ‌ర్ వ్యాధి ఉన్నవారు మారేడు మంచి ఔషధం. అలాగే విరేచ‌నాలు కూడా త‌గ్గుతాయి.
రేగు: చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికీ రేగు ఆకులు మంచి మెడిసిన్.
గరిక: మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు గ‌రిక‌లో ఉన్నాయి.
ఉత్తరేణి: ద‌గ్గు, ఆస్త‌మా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉత్త‌రేణి ఆకులు బాగా ప‌నిచేస్తాయి.
ములక: ఈ ఆకు శ్వాస కోశ స‌మ‌న్యల‌ను న‌యం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారికి ఈ ఆకును వాడితే గుణం క‌నిపిస్తుంది.
ఉమ్మెత్త : శ్వాస‌కోశ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఉమ్మెత్త బాగా ప‌నిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని త‌గ్గిస్తుంది.
తులసి: శ‌రీరం వేడిగా ఉండేవారి శరీరం చల్లబడాలంటే తుల‌సి ఆకుల‌ను న‌మ‌లాలి. అలాగే శ్వాస కోశ స‌మ‌స్యల‌కు కూడా తుల‌సి దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.
మామిడి: నోటి దుర్వాస‌న‌, చిగుళ్ల వాపు స‌మ‌స్య‌ల‌ను మామిడి ఆకు త‌గ్గిస్తుంది. మామిడి పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటే నోరు దుర్వాస‌న రాకుండా ఉంటుంది.
గన్నేరు: గ‌డ్డ‌లు, పుండ్లు, గాయాలు త‌గ్గేందుకు ఈ మొక్క వేరు, బెర‌డును ఉప‌యోగిస్తారు.
మరువక పత్రం: ఈ ఆకులు సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. వీటి వాస‌న చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది.
గండలీ పత్రం: అతిమూత్ర స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఆకును ఉప‌యోగిస్తారు
జిల్లేడు: న‌రాల బ‌ల‌హీన‌త‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న వారికి ఈ ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
వావిలాకు: కీళ్ల నొప్పుల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఆకును వాడితే ఉప‌యోగం ఉంటుంది.
రావి: చ‌ర్మ స‌మ‌స్య‌లు వారికి రావి ఆకులు బెస్ట్ మెడిసిన్
దానిమ్మ: వాంతులు, విరేచ‌నాల‌ను అరిక‌ట్ట‌డంలో దానిమ్మ ఆకులు మంచి మెడిసిన్.
జాజి పత్రం: చ‌ర్మ స‌మ‌స్య‌లున్న‌వారు, స్త్రీ సంబంధ వ్యాధుల‌కు ఈ ఆకును ఉప‌యోగిస్తే ఫ‌లితం ఉంటుంది.
అర్జున పత్రం: గుండె ఆరోగ్యానికి, ర‌క్తం సరఫరా అయ్యేందుకు ఈ ఆకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
దేవదారు పత్రం: శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు ఈ ఆకుల‌ను వాడితే ఫ‌లితం ఉంటుంది.