Breaking News

అదిరిపోయిన నాని ‘టక్ జగదీష్’ ట్రైలర్

1 0

నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. భూదేవిపురం గురించి మీకు ఓ కథ చెప్పాలి అంటూ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఫ్యామిలీ అనుబంధాలను ఈ ట్రైలర్‌లో చక్కగా చూపించారు. ఇక హీరోయిన్ రీతూవర్మ వీఆర్వోగా పనిచేస్తున్నట్లు చూపించారు. ఈ సినిమాలో ఆమె పేరు గుమ్మడి వరలక్ష్మీ. తమన్ సంగీతం, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో నానికి అన్నయ్యగా జగపతిబాబు కనిపించాడు. వాళ్లిద్దరి మధ్య డైలాగులు ఆకట్టుకున్నాయి. షైన్ స్క్రీన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.