Breaking News

ఓటీటీలోనే నాని ‘టక్ జగదీష్’.. రిలీజ్ ఎప్పుడంటే?

1 0

శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మూవీ టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. గతంలో ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో నిర్మాతలు ఇప్పటివరకు వెయిట్ చేశారు.

కానీ ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నా విడుదల సినిమాలకు ఆశించిన స్థాయిలో జనాలు రావడం లేదు. వీకెండ్‌లో కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సాహసించడం లేదు. దీంతో ‘టక్ జగదీష్’ సినిమాను డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు ఉన్నప్పుడు, రిస్క్ చేయడం అవసరమా? అని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. కాగా సెప్టెంబరులో ఓటీటీ ద్వారా ‘టక్ జగదీష్’ రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే వెంకటేష్ నటించిన ‘నారప్ప’ నేరుగా ఓటీటీలో విడుదల కాగా.. త్వరలో నితిన్ ‘మ్యాస్ట్రో’ కూడా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది.