ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 100 ఏళ్ల కిందటే రూ.10 కరెన్సీ నోటుపై రామప్ప ఆలయం ముద్రించబడింది. అప్పట్లోనే నైజాం రాజులు రామప్ప ఆలయానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ గౌరవాన్ని కట్టబెట్టారు. ఈ మేరకు 1923లోనే రామప్ప ఆలయం చిత్రంతో కూడిన రూ. 10 నోటును అప్పటి ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తయారుచేయించారు. సదరు కరెన్సీ నోట్లను ప్రింటింగ్ చేసేందుకు థామస్ డెలా అనే కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ అప్పటికే నోట్ల ప్రింటింగ్‌కు సంబంధించిన ఒప్పందం వాటర్‌లా అండ్ సన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కంపెనీతో ఒప్పందం కుదిరి ఉండటంతో ఈ రూ.10 నోటు చెలామణిలోకి రాలేదు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ తయారుచేయించిన రూ.10 కరెన్సీ నోటుపై ఒకవైపు రామప్ప ఆలయం ఉండగా… మరోవైపు ఇంకో ఆలయం కూడా ఉంది. కానీ ఆ ఆలయం వివరాలను మాత్రం ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆనాటి రూ. 10 నోటుపై ఉన్న మరో ఆలయం పేరు కనుక్కోగలిగితే వారికి వెండి నాణేం బహుమతిగా ఇస్తానని హైదరాబాద్ వారసత్వ నిపుణుడు అమర్‌బీర్ చెప్తున్నారు. ఎవరైనా ఈ ఆలయాన్ని పోల్చగలిగితే amarbir@gmail.comకు మెయిల్ చేయాలని ఆయన సూచించారు.
Read More: సమంతాదే ప్రపంచంలో అతిపెద్ద నోరు