Breaking News

సమంత ‘సూపర్ డీలక్స్’ తెలుగు వెర్షన్ ఓటీటీలో వచ్చేస్తోంది

0 0

విజయ్ సేతుపతి డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్న తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ మూవీలో రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ ఫాజల్ కీలకపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

దర్శకుడు మిస్కిన్, గాయత్రి అయ్యర్, మృణాళిని రవి తదితరులు నటించిన ‘సూపర్ డీలక్స్’ పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, వివిధ కేటగిరీలలో అవార్డులు గెలుచుకుంది. యువన్ శంకర్ రాజా సంగీత మందించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. జూలై 9 నుంచి ‘సూపర్ డీలక్స్’ మూవీ ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.