అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన కొన్నిగంటల తర్వాత ఎలక్టోరల్ ఓట్లు లెక్కించి బైడెన్‌కు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ను కూడా గుర్తించింది. దీంతో ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించారు. కానీ ఈ ఎన్నికల్లో మోసం జరిగిందని మళ్లీ మళ్లీ చెప్పారు. కాగా నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.