Breaking News

మిస్ కాకండి.. ఈ ఓటీటీలో రెండు రోజుల పాటు సినిమాలన్నీ ఉచితం

1 0

ఇప్పుడు అంతా ఓటీటీ యుగం నడుస్తోంది. సినిమా థియేటర్లకు వెళ్లే బదులు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఏడాది మొత్తం సినిమాలు చూడవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఈటీవీ విన్, సోనీ లివ్, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఓటీటీలు ప్రత్యేక ఆఫర్లను కూడా యూజర్లకు అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కూడా ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించింది. ఈనెల 26, 27 తేదీల్లో తమ ఓటీటీలో ఉన్న కంటెంట్ అంతా ఉచితంగా చూడొచ్చని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఈటీవీ విన్ ఒక పోస్ట్ షేర్‌ చేసింది. ‘మీ అందరి కోసం ఎంతో ఉత్సాహవంతమైన అనౌన్స్‌మెంట్‌. ‘వాచ్‌ పార్టీ’ పేరుతో ఈటీవీ విన్‌ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సినిమాలు, షోలను ఆగస్టు 26, 27 తేదీల్లో మొత్తం 2 రోజుల పాటు ఉచితంగా చూసేయండి. ఈ వారాంతంలో మీ ప్లాన్స్‌ అన్నీ క్యాన్సిల్‌ చేసుకోండి. తమ యాప్‌లోని కంటెంట్‌ మొత్తాన్ని చూసి ఆనందించండి’ అంటూ ఈటీవీ విన్ తెలిపింది.

కాగా ఈటీవీ విన్‌లో కొత్త సినిమాలతో పాటు ఎక్కడా లభించని పాత సినిమాలు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, సమ్మోహనం, పంచతంత్రం, మ్యాచ్ ఫిక్సింగ్, అసలు, డియర్ మేఘా, కనులు తెరిచినా కనులు మూసినా, పోలీస్ స్టోరీ వంటి సినిమాలతో పాటు నువ్వేకావాలి, ఆనందం, రేసు గుర్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, ప్రేమకు వెళాయెరా, చిత్రం, మనసుంటే చాలు, నమో వెంకటేశాయ, అమీ తుమీ, తుంటరి, శౌర్య వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈటీవీ సీరియల్స్, జబర్దస్త్ వంటి షోలు కూడా ఉచితంగా వీక్షించవచ్చు.