Breaking News

శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ నుంచి హై ఓల్టేజ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ విడుదల

0 0

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. దర్శకుడు శ్రీని ఈ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ రాజకీయ నేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది.

తాజాగా ఘోస్ట్ చిత్రం నుండి ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్’ లిరిక్ వీడియో విడుదల చేశారు. అర్జున్ జన్య కంపోజ్ చేసిన ఈ హై ఓల్టేజ్ సాంగ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. చెన్నై లయోలా కాలేజీలో అభిమానుల సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు, మేకింగ్ గ్లింప్స్‌తో కూడిన లిరిక్ వీడియో చిత్రం మీద అంచనాలు మరింత పెంచేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఆకట్టుకునే ప్రచార చిత్రాలతో పాటు, ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ జైలర్‌లో శివన్న పాత్రకు వచ్చిన ట్రేమెండస్ రెస్పాన్స్ ఘోస్ట్ చిత్రంపై మరింత హైప్ తీసుకొచ్చింది. హిందీకి సంబంధించి ఘోస్ట్ చిత్ర హక్కులన్నింటినీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జయంతీ లాల్ గడ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సినిమా మీద ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.

ఘోస్ట్ మూవీలో ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వీఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడలో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ మూవీని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది.