Breaking News

నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’కి ఆయన శాపమే తగిలిందా?

2 0

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే కరోనా కారణంగా ఈ ఒక్క సినిమానే కాదు చాలా సినిమాలు కూడా వెనక్కు వెళ్లాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ‘లవ్‌స్టోరీ’ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. దీంతో సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా విడుదల పోస్టర్‌లో వినాయకుడిని లవ్‌స్టోరీ చిత్ర బృందం అవమానించింది. వినాయక చవితిని ‘వినకాయ చవితి’గా మూవీ యూనిట్ పేర్కొనడంతో సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం వినాయకచవితికి విడుదల కావడం లేదు. దీంతో వినాయకుడి శాపం ఈ సినిమాకు తగిలిందని.. అందుకే విడుదల వాయిదా పడిందని మళ్లీ ట్రోల్స్ రాయుళ్లు మొదలుపెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో ఆ వినాయకుడికే తెలియాలి.