Breaking News

‘కేజీఎఫ్-2’ విడుదల రోజు సెలవు ప్రకటించాలని మోదీకి ట్వీట్

0 0

కన్నడ యువ నటుడు యష్ హీరోగా నటించిన‘కేజీఎఫ్‌-2’ రిలీజ్‌ డేట్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జులై 16న సెలవు ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌- 2’ ఈ ఏడాది జులై 16న విడుదలవుతున్న విషయం తెలిసిందే. సినీ ప్రియులందరూ ఆ సినిమా కోసం ఎప్పటినుంచే నిరీక్షిస్తున్నారు. ఆ సినిమా విడుదలయ్యే రోజున దయచేసి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని మేము కోరుతున్నాం. మా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అది కేవలం సినిమా మాత్రమే కాదు మా ఎమోషన్‌’ అని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.