67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నాని నటించిన‘జెర్సీ’ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి (జెర్సీ) అవార్డు పొందారు. అటు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక సినిమాగా నిలిచింది. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం (మహర్షి) నిలిచారు. అటు ఉత్తమ ప్రొడక్షన్ హౌస్‌గా వెంకటేశ్వర క్రియేషన్స్ (మహర్షి) నిలిచింది.
జాతీయ ఉత్తమ తమిళ మూవీగా ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా నిలిచింది. ఉత్తమ సహాయనటుడిగా విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్) అవార్డు సాధించారు. ఇక హిందీలో ‘చిచ్చోర్’మూవీకి ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా మణికర్ణిక, పంగా సినిమాలకు గానూ కంగనా రనౌత్‌కు అవార్డు లభించింది.
ఇంకా పలు కేటగిరీల్లో అవార్డు వివరాలు:
ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే), ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్, ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్(మలయాళం), ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో, ఉత్తమ మేకప్: హెలెన్, ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ), ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)