నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అన్నదమ్ముల కథతో తెరకెక్కిన ఈ మూవీలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ ఓ పాట ద్వారా తన కుటుంబం కోసం జగదీష్ ఏం చేశాడో చూపించారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది.
