Breaking News

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

1 0

పుదుచ్చేరిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనంతరం అనూహ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళసైకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని సీఎం నారాయణస్వామిని ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్షలో తనకు సంఖ్యాబలం లేదని తెలుసుకుని అసెంబ్లీ నుంచి ఆయన బయటకొచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసే అవకాశ ముందని తెలుస్తోంది. కాగా బలపరీక్షలో నెగ్గాలంటే నారాయణస్వామికి 14 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండగా కాంగ్రెస్ బలం 12కి తగ్గినట్లు తెలుస్తోంది.