చెన్నై వేదికగా గురువారం నాడు ఐపీఎల్ వేలం జరగనుంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు నాణ్యమైన ఆటగాళ్లను వెతికే పనిలో ఉన్నాయి. కానీ RCB మాత్రం పంజాబ్ వదులుకున్న స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ వైపే ఉందని మాజీ ఆటగాడు గంభీర్ అభిప్రాయపడ్డాడు. RCBలో కోహ్లీ, డివిలియర్స్‌లపై అధిక భారం పడుతోందని.. అలా కాకుండా ఉండాలంటే ఆ జట్టుకు మరో ఎక్స్ ఫ్యాక్టర్ కలిగిన మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ఆటగాడు కావాలని తెలిపాడు. అందుకే రేపటి వేలంలో RCB జట్టు మ్యాక్స్వెల్వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నాడు. కానీ ఆ జట్టు ఉమేష్ లాంటి పేసర్‌ను వదులుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. రేపటి వేలంలో ఉమేష్‌ను పంజాబ్ జట్టు దక్కించుకునే అవకాశం ఉందన్నాడు. ఆ జట్టులో షమీతో కలిసి ఉమేష్ కొత్త బంతిని పంచుకుంటాడని అభిప్రాయపడ్డాడు.