Breaking News

హృతిక్ రికార్డును బద్దలు కొట్టిన వైష్ణవ్ తేజ్

1 0

తొలి మూవీతోనే పంజా వైష్ణవ్ తేజ్ ఊహించని విధంగా రికార్డులు సాధిస్తున్నాడు. అతడు నటించిన ‘ఉప్పెన’ మూవీ ఐదు రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు డెబ్యూ హీరోల రికార్డులను తెలుగులో మాత్రమే క్రాస్ చేసిన వైష్ణవ్.. ఇప్పుడు ఇండియా వైడ్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో 21 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది. భారత్‌లో ఇప్పటి వరకు డెబ్యూ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు హృతిక్ రోషన్ పేరు మీద ఉంది. 21 ఏళ్ళ కింద అతడు నటించిన ‘కహో నా ప్యార్ హై’ సినిమా అప్పట్లో రూ.42 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పటిదాకా ఏ డెబ్యూ హీరో కూడా దాన్ని టచ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ దాన్ని తుడిచేశాడు. ఐదురోజుల్లో ‘ఉప్పెన’ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఒక్క నైజాంలోనే రూ.10 కోట్లు వచ్చినట్లు సమాచారం.