Breaking News

GST పరిధిలోకి నేచురల్ గ్యాస్

0 0

పన్నులతో పెరిగిపోయిన ఇంధన ధరల నుంచి సామాన్యులకు ఊరట లభించనుంది. త్వరలోనే నేచురల్ గ్యాస్‌ను GST పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సహజ వాయువును GST పరిధిలోకి తీసుకువచ్చేందుకు భారత్‌ కట్టుబడి ఉందని, భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమిళనాడులో రామనాధపురం-తూత్తుకుడి నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను, గ్యాసోలిన్‌ డీసల్ఫరైజేషన్‌ యూనిట్‌ను ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. రూ.31,500 కోట్లతో సీపీసీఎల్‌ నిర్మించే గ్రాస్‌ రూట్‌ రిఫైనరీకి ఆయన శంకుస్ధాపన చేశారు. 2019-20లో భారత్‌ దేశీయ అవసరాల కోసం 85 శాతం చమురు నిల్వలను 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకుందని మోదీ వివరించారు. గతంలోనే ఈ ప్రాజెక్టులను చేపట్టి ఉంటే మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారాలు ఉండేవి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సహజ వాయువు GST పరిధిలో లేకపోవడంతో దానిపై కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్‌, సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ వంటి పలు పన్ను భారాలతో ఇంధన ధరలు భారంగా మారాయి.