టెక్ దిగ్గజం, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సీఈవో పదవి నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆయన స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ‘ఆండీ జాస్సీ’ సీఈవోగా నియామకం కానున్నారు. నూతన సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జాస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీస్ ఏర్పాటులోనూ కీలకమయ్యారు. అయితే సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు బెజోస్ చేసిన ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌తో పాటు అమెరికా వ్యాపార వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. కాగా అమెజాన్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బెజోస్ కొనసాగనున్నారు. 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిన సంగతి తెలిసిందే.