Breaking News

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరంటే?

0 0

మనదేశంలో ఐపీఎల్ క్లబ్‌ల మాదిరిగానే ఇతర దేశాల్లో ఫుట్‌బాల్ క్లబ్‌లకు భారీ గిరాకీ ఉంది. అందుకే ఇతర దేశాల ఆటగాళ్లను తీసుకొచ్చి మరీ భారీ పారితోషికం చెల్లిస్తుంటాయి. వీరిలో అర్జెంటీనా ఆటగాడు మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అతడు యూరోపియన్ లీగ్ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సదరు క్లబ్‌కు అతడు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే మెస్సీకి బార్సిలోనా క్లబ్ చెల్లించే పారితోషికం వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. నాలుగు సీజన్‌ల పాటు ఆడేందుకు ఏకంగా రూ.4,906 కోట్ల పారితోషికాన్ని బార్సిలోనా క్లబ్ మెస్సీకి చెల్లిస్తోందని ఎల్ ముండో అనే పత్రిక ఓ కథనం ప్రచురించింది. అంటే ఏడాదికి మెస్సీ రూ.1,217 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం. కాగా ఎల్ ముండో పత్రిక మెస్సీతో తమ ఒప్పందం వివరాలు బహిర్గతం చేసినందుకు బార్సిలోనా క్లబ్ మండిపడుతోంది.