భారత్లో క్రమంగా లీటర్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లో స్పీడ్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ దాటేసింది. తెలుగు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ దాదాపు రూ.90 పలుకుతోంది. గతంలో పెట్రోల్ ధరలు పెరిగితే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ధరలు ఎంత పెరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పెట్రోల్ ధరలు పెరగడంతో అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. కాంగ్రెస్ హయాంలో బ్యారెల్ పెట్రోల్ ధర ఎక్కువ ఉన్నా లీటర్ పెట్రోల్ ధర తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో బ్యారెట్ పెట్రోల్ ధర తక్కువగా ఉన్నా అడ్డమైన ట్యాక్సుల వల్ల లీటర్ పెట్రోల్ ధర శరవేగంతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అసలు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వెనిజులా: రూ.1.50
సౌదీ అరేబియా: రూ.10.12
ఇరాన్: రూ.10.25
ఖటార్: రూ.26
కువైట్: రూ.27.75
ఈజిప్ట్: రూ.31.5
మలేషియా: రూ.37.5
శ్రీలంక: రూ.38.4
దుబాయ్: రూ.41
రష్యా: రూ.46
బ్రెజిల్: రూ.49
అమెరికా: రూ.51
పాకిస్థాన్: రూ.51.3
థాయ్లాండ్: రూ.53.8
బంగ్లాదేశ్: రూ.56
నేపాల్: రూ.58.2
స్విట్జర్లాండ్: రూ.61.8
న్యూజిలాండ్: రూ.63.9
ఆస్ట్రేలియా: రూ.68.8
దక్షిణాఫ్రికా: రూ.71.1హంగేరీ: రూ.99
ఐర్లాండ్: రూ.107
జర్మనీ: రూ.108
ఫ్రాన్స్: రూ.118
ఇటలీ: రూ.119
యూకే: రూ.122
హాంకాంగ్: రూ.145