Breaking News

టీవీలోనూ దుమ్మురేపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

1 0

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ మూవీ లాంగ్ రన్‌లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చాలా చోట్ల నాన్ RRR రికార్డులను క్రియేట్ చేసింది. ఓటమి లేని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్‌ అయ్యింది. ముఖ్యంగా ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడిన గోదారి గట్టు మీద రామచిలకవే పాట కుర్రకారును ఒక ఊపు ఊపింది. థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇటీవల ఓటీటీ, టీవీలో ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏంటంటే.. టీవీలోనూ ఈ మూవీ దుమ్మురేపింది. గత రెండేళ్లలో ఏ సినిమాకు రాని టీఆర్పీని వెంకీ మామ సినిమా సొంతం చేసుకుంది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ఈ చిత్రం టెలీకాస్ట్ కాగా ఏకంగా 15.92 రేటింగ్ నమోదైంది. ఇది కేవలం జీ తెలుగు ఎస్‌డీ ఛానల్‌కు సంబంధించింది మాత్రమే. అటు జీ తెలుగు హెచ్‌డీలో 2.3 రేటింగ్ సొంతం చేసుకుంది. మొత్తంగా 18కి పైగా రేటింగ్ నమోదైనట్లు బార్క్ వెల్లడించింది.