Breaking News

రీరిలీజ్ హవా.. టాప్-3 సినిమాలు ఇవే..!!

0 0

టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. గత మూడేళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా తప్పకుండా రీ రిలీజ్ అవుతోంది. పోకిరి‌తో మొదలైన ఈ హవా సూపర్ హిట్ ఫార్ములాగా మారిపోయింది. దీంతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పాత సినిమాలు రీ రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. వీటిలో హిట్ సినిమాలు ఉంటున్నాయి.. యావరేజ్ సినిమాలు ఉంటున్నాయి.. ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే బుక్ మై షో ప్రీ సేల్స్ విషయంలో టాప్-3 సినిమాల విషయానికి వస్తే మహేష్ మూవీ మురారి ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మురారి 24 గంటల్లో 41వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో ప్రభాస్ మూవీ సలార్ ఉంది. సలార్ ఈనెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి 24 గంటల్లో 25వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీకి 24 గంటల్లో 16,400 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.