ఏపీలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఇటీవల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయగా ఆ నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డువస్తాయని భావించింది. దీంతో ఎస్ఈసీ జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా లేమని ఏపీ ప్రభుత్వం పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తీర్పుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘అయ్యా నిమ్మగడ్డ గారూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేకపోతే చంద్రబాబు ఇంటికి వెళ్తారా? చెప్పండి ప్లీజ్’ అంటూ ఎద్దేవా చేశారు.