తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, తమిళంలో సూర్య ఇద్దరూ స్టార్ హీరోలే. కాకపోతే సూర్య కంటే పవన్‌కు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ అంతే. అయితే వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ చేయనిది… జైభీమ్‌లో సూర్య చేసి చూపించాడు. ముఖ్యంగా జై భీమ్ లాంటి కథను నిర్మాతగా సూర్య చాలా తక్కువ బడ్జెట్లో నిర్మించి రిచ్ లుక్ తీసుకువచ్చాడు. ఇక రెండు సినిమాలకు పోలిక ఎక్కడంటే.. వకీల్ సాబ్‌లో పవన్ లాయర్ కాగా.. జై భీమ్‌లో సూర్య కూడా లాయరే.
అయితే వకీల్‌సాబ్ కమర్షియల్‌గా తీసి పవన్ తూతూ మంత్రంగా కలెక్షన్లు రాబట్టాడు. కానీ జై భీమ్ లాంటి కథను సూర్య పక్కదారి పట్టకుండా తీసి శభాష్ అనిపించుకున్నాడు. అక్కర్లేని శ్రుతిహాసన్ క్యారెక్టర్‌ను పెట్టించుకుని పాటలు, ఫైట్స్, అసహ్యమైన డైలాగులతో పావలా యాక్షన్‌ను పవన్ రూపాయి చేసి బిల్డప్ ఇచ్చాడనే చెప్పాలి. కానీ జై భీమ్‌లో సూర్య పాత్ర ఎక్కడా ఓవరాక్షన్ చేయలేదు. సూర్య ఒక్క ఫైట్ కూడా చేయలేదు. ఒక్క పంచ్ డైలాగ్ కూడా చెప్పలేదు. కేవలం నటనతోనే హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యాన్స్ కోసమే అని కాకుండా అధిక సంఖ్యలో ఉన్న ఇతర ప్రజానీకాన్ని పట్టించుకుని వారిని మెప్పించే సినిమాలు తీస్తే గతంలో లాగా బలమైన స్టామినాతో కలెక్షన్లు సంపాదించే అవకాశముంటుంది.