Breaking News

ఎట్టకేలకు రూ.కోటి గెలుచుకున్న కంటెస్టెంట్

0 0

హిందీలో ఎంతో పాపులర్ అయిన కౌన్ బనేగా కరోడ్‌పతి తరహాలో తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతోంది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఒక్కరు కూడా రూ.కోటిని గెలుచుకోలేదు. ప్రస్తుతం నాలుగో సీజన్ జెమినీ టీవీలో ప్రసారం అవుతుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ మాత్రం ఏకంగా కోటి రూపాయల ప్రశ్నను చూశాడు.. దానికి సమాధానం కూడా చెప్పాడు అంటూ జెమినీ టీవీ వర్గాల వారు చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ టాలెంటెడ్ వ్యక్తి ఎవరై ఉంటారు.. కోటి రూపాయలు అతడు గెలుచుకున్న సమయంలో ఎన్టీఆర్ ఫీలింగ్ ఏంటి? ఇంతకు ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటి? అనే విషయాల గురించి అందరూ అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ ఇది నిజమా? లేదా పబ్లిసిటీ స్టంటా అనేది మరికొన్ని వారాల్లోనే తెలిసిపోనుంది.