బిగ్బాస్ షో మూడో వారాంతానికి చేరింది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా మూడో వారంలో లహరి నిష్క్రమించనుందని తెలుస్తోంది. ఈ వారం మొత్తం ఐదుగురు నామినేషన్లో ఉండగా.. వారిలో శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి ఉన్నారు. ఈ లిస్ట్ నుంచి శ్రీరామచంద్ర, ప్రియాంక శనివారం సేఫ్ అయ్యారు. మిగతా ముగ్గురిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే లహరికి తక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. రవి, ప్రియ, లహరి ఇష్యూ వలన లహరికి బ్యాడ్ నేమ్ వచ్చిందని అందుకే ఆమెకు ఓటింగ్ తక్కువగా పడిందని తెలుస్తోంది. అయితే టీఆర్పీ రేటింగ్ కోసం లహరిని కాకుండా.. ప్రియను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో?
