Breaking News

‘ఈనాడు’కు టాటా చెప్పేసిన కార్టూనిస్ట్ శ్రీధర్

0 0

ఈనాడు దినపత్రికతో తనకున్న 40 ఏళ్ల బంధానికి కార్టూనిస్ట్ శ్రీధర్ ముగింపు పలికాడు. 1981లో ఈనాడులో కార్టూనిస్టుగా చేరిన శ్రీధర్ 2021 ఆగస్టు 31న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీంతో ఈనాడులో ఇకపై శ్రీధర్ కార్టూన్లు పాఠకులకు కనపడవు. ఎందుకంటే ఈనాడులో శ్రీధర్ వేసిన కార్టూన్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈనాడు దినపత్రికకు శ్రీధర్ వేసిన కార్టూన్‌లు ఎంతో వెన్నుదన్నుగా నిలిచాయి. అతడి కార్టూన్‌లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. 

ఈనాడులో 1982 నుండి 1999 వరకు శ్రీధర్ వేసిన రాజకీయ కార్టూన్‌లను ఒక సంకలనంగా ఉషోదయా పబ్లికేషన్స్ తెచ్చింది. అందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి. శ్రీధర్ కార్టూన్‌లలో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ. ఆ పుస్తకం ముందుమాటలో రామోజీరావు ‘కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్‌ఫెక్ట్ రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్‌తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్‌దేనని చెప్పగలను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో తెలుస్తుంది శ్రీధర్ గొప్పతనం ఏంటో.