Breaking News

మహిళలు ఏ వయసులో గర్భం దాల్చాలి?

2 0

మహిళలు గర్భం ధరించడం అనే విషయం జీవితంలో చాలా ఆనందకర విషయం. అయితే గర్భం ధరించే విషయంలో చాలా మంది మహిళలు ఒత్తిడికి గురవుతున్నారు. పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనమని అత్తింటి వారు ఒత్తిడి చేయడం, వైవాహిక జీవితం కొంత కాలం ఆనందంగా గడిపాకే పిల్లల్ని కందామని భర్త ఒత్తిడి చేయడం ఇందుకు పలు కారణాలుగా నిలుస్తున్నాయి.

అయితే 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు మహిళల శరీరంలో జరిగే అండోత్పత్తికి కారణమయ్యే అండాలు దృఢంగా ఉంటాయి. 18 ఏళ్ల లోపు వారిలో గర్భాశయం, అండాశయం పూర్తిగా పరిపక్వత చెంది ఉండవు. అయితే 18 నుంచి 22 ఏళ్ల మధ్య స్త్రీ మానసికంగా దృఢంగా ఉండకపోవచ్చు. కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి వారికి సమయం పడుతుంది. 22-28 ఏళ్ల మధ్య స్త్రీ గర్భం దాల్చితే.. పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలున్నాయి. అదే 35 ఏళ్ల తర్వాత అయితే.. అండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే 22-28 ఏళ్ల మధ్య మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.