తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీపీసీసీ చీఫ్గా రేవంత్ బాధ్యతలు తీసుకున్న రోజే.. ఆయన సీఎం అయినంత హడావిడి చోటుచేసుకుంది. చాలా కాలం తర్వాత భాగ్యనగరంలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయంటే అతిశయోక్తి కాదు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి అభిమానం గణం ఓ రేంజ్లో బైక్ ర్యాలీలు, పూజలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయ పోటీ ముక్కోణపు ప్రేమకథలా ఉంటుందని అర్ధమవుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రతరం కానుంది. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీ ఓటు ఎవరికో పోల్ ద్వారా తెలియజేయండి.