Breaking News

బన్నీ అభిమానులకు బర్త్‌డే ట్రీట్

1 0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇప్పుడు యూత్‌లో భీకరమైన ఫాలోయింగ్ ఉంది. పుష్ప-1, పుష్ప-2 సినిమాల తర్వాత బన్నీ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో పుష్ప సిరీస్ తర్వాత అతడు చేయబోయే సినిమాపై అందరి దృష్టి నెలకొంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్లాన్ చేసింది. ఈ మూవీకి ‘లెగసీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేయాలని దర్శకుడు అట్లీ భావించాడు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అని తెలుస్తోంది. దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో భారీ హైప్ నెలకొంది. మరోవైపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అతడి బ్లాక్ బస్టర్ మూవీ ‘రేసుగుర్రం’ రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బుక్ మై షో యాప్‌లో టిక్కెట్లు జోరుగా అమ్ముడుపోతున్నాయి.