థియేటర్లలో ఒక సినిమా 100 రోజులు ఆడితే ఎంత గొప్పో.. బుల్లితెరపై ఎక్కువ టీఆర్పీ తెచ్చుకోవడం కూడా అంతే గొప్ప. ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు సినిమాలకు టీఆర్పీలు తగ్గిపోయాయి. సినిమా విడుదలైన నెలలోపు టెలీకాస్ట్ చేస్తే రెండంకెల టీఆర్పీ సాధ్యమే అని సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలు నిరూపించాయి. పుష్ప-2 సినిమాకు కూడా రెండంకెల టీఆర్పీ వచ్చింది. ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా నిలిచింది. ఈ మూవీ జెమినీలో ప్రసారం కాగా ఏకంగా 29.9 టీఆర్పీ వచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మూవీ 29.4 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచి త్రుటిలో ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మూవీ కూడా జెమినీ టీవీనే ప్రసారం చేసింది. ఈ జాబితాలో రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ (స్టార్ మా) 24 రేటింగ్‌తో మూడో స్థానం దక్కించుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ (జెమినీ) కూడా 24 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (జెమినీ) 23.4 రేటింగ్‌తో నాలుగో స్థానం కైవసం చేసుకుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ ‘బాహుబలి 2′(స్టార్ మా) 22.7 రేటింగ్‌తో ఐదో స్థానం సంపాదించింది.
