Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన ‘విష్ణు విన్యాసం’

0 0

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్, హీరో శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. అయితే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓ మాదిరి వసూళ్లను మాత్రమే సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లోనూ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. కథ విషయానికి వస్తే.. హీరో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అతడికి జాతకాల పిచ్చి ఉంటుంది. మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోడు. అతడిని చూసి మరో జూనియర్ లెక్చరర్ మనీషా ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవడానికి ముందు ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. ఆ నిజం తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడన్నదే మిగతా స్టోరీ. యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీని సుమంత్ నాయుడు నిర్మించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, శ్రీనివాస్ వడ్లమాని కీలకపాత్రలు పోషించారు.