టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అతడు నటించిన పాత సినిమాలను రీ-రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఊసరవెల్లి’ని రీరిలీజ్ చేయబోతున్నారు. ‘ఊసరవెల్లి’ గ్రాండ్ థియేట్రికల్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర బృందం అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రకటించింది. మే 20న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున ‘ఊసరవెల్లి’ షోలు పడనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #NTRBirthdayతో పాటు #OosaravelliReRelease వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. వక్కంతం వంశీ కథతో తెరకెక్కిన ఈ సినిమా 2011, అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. బాక్సాఫీస్ దగ్గర రూ.27.6 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో తారక్ నటన, లుక్, హెయిర్ స్టైల్ అంతా కొత్తగా ఉంటాయి. అంతే కాదు ఈమూవీకి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా కోసం అద్నాన్ సమీఖాన్ ఆలపించిన నువ్వంటే నాకు చాలా ఇష్టం పాటతో పాటు.. నిహారిక.. నిహారిక అంటూ సాగే సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
