హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబో అంటే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో వీళ్ల కాంబినేషన్ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాబోతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేయగా.. అభిమానులను ఆకట్టుకుంటోంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ కట్ ఉంది. దీంతో వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ వేరే లెవల్లో ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. వాడు నీకు భయపడలేదా.. ఎవరికీ భయపడలేదా..?, ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలవుతుంది అంటూ సాగే డైలాగులు ఉర్రూతలూగిస్తున్నాయి. శ్రీలీలతో లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే బీజీఎంను తమన్ అందించాడు. పోటీగా బాలీవుడ్ మూవీ దురంధర్-2 విడుదలవుతున్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఈ ఉగాదికి తెలుగు రాష్ట్రాలు పవన్ నామ స్మరణతో ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
