ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్‌లో ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ జాబితాలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కే ర్యాంప్ సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా మిత్రమండలి సినిమా విడుదల కాగా తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. మిగిలిన మూడు సినిమాలకు బిలో యావరేజ్ నుంచి ఎబౌ యావరేజ్ టాక్ మాత్రమే వచ్చాయి. కానీ కిరణ్ అబ్బవరం సినిమా కే ర్యాంప్ మాత్రం బయ్యర్లకు లాభాలను మిగిల్చింది. గత ఏడాది ‘క’ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలవగా.. ఈ ఏడాది కూడా అదే ఫలితాన్ని కే ర్యాంప్ అందించింది. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను అలరించింది. లేడీ డైరెక్టర్ నీరజ కోన తెరకెక్కించిన ఈ మూవీ రిలేషన్ షిప్ నేపథ్యంగా రూపొందింది. అయితే ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. డీజే టిల్లు తరహాలో వినోదం ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ కలిగించడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. తమిళ డబ్బింగ్ సినిమా డ్యూడ్ కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. యూత్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ సినిమాలో పెద్ద మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర చివరకు యావరేజ్ ఫలితం పొందింది. తాజాగా దీపావళి సినిమాలు ఓటీటీలోకి సిద్ధమయ్యాయి. డిజాస్టర్ మూవీ మిత్రమండలి ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించిన కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ మూవీలో ఆహా వేదికగా ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇలా దీపావళికి అలరించిన మూడు సినిమాలు ఒకేవారం ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి.
