Breaking News

దివ్వెల మాధురి – భరణి మధ్య బిర్యానీ వార్

1 0

బిగ్‌బాస్-9 తెలుగులో కామనర్స్, సెలబ్రిటీల మధ్య తొలుత వార్ నడిచినా.. ప్రస్తుతం అందరూ ఫ్రెండ్స్‌గా కలిసిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. ముఖ్యంగా దివ్వెల మాధురి నోటిదురుసుతో అందరినీ ఓ ఆట ఆడుకుంటోంది. తాజాగా బిస్‌బాగ్ హౌస్‌లో థమ్సప్ విత్ బిర్యానీ అనే టాస్క్ నిర్వహించారు. కంటెస్టెంట్లు రెండు టీములుగా విడిపోయి ఇందులో పాల్గొన్నారు. ఇరు జట్ల నుంచి డెమోన్ పవన్, దివ్వెల మాధురి పాల్గొన్నారు. బజర్ మోగేలోపు బిర్యానీకి కావాల్సిన వస్తువులను ఏ టీమ్ సభ్యులు ఎక్కువగా సేకరిస్తారో వారు టాస్క్ విజేతలుగా నిలిచి థమ్స్ అప్ విత్ బిర్యానీ ఎంజాయ్ చేయవచ్చని బిగ్ బాస్ తెలిపాడు. అనంతరం డెమోన్ పవన్, మాధురి ఇద్దరూ టాస్క్ ఆడగా డెమోన్ పవన్ విజేతగా నిలిచాడు. దీంతో డెమోన్ పవన్ అండ్ టీమ్‌కు థమ్స్ అప్ విత్ బిర్యానీ దక్కింది.

ఇక్కడే అసలు గొడవ మొదలైంది. బిర్యానీ మీద ప్రేమతో దివ్వెల మాధురి తినడానికి ప్రయత్నించింది. అయితే భరణి ఆమెను తినకుండా ఆపాడు. గెలిచిన టీమ్ తొలుత తినాలని చెప్పాడు. దీంతో దివ్వెల మాధురి హర్ట్ కావడంతో ఆమె తినకుండా వెళ్లిపోయింది. తాను నార్మల్‌గానే చెప్పానని.. ప్రతిదానికి ఫీల్ అయితే ఏం చేయలేమని భరణి చెప్పినా మాధురి అలక వీడలేదు. ఈ అంశంపై ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. వీళ్లిద్దరి మధ్యలోకి కెప్టెన్ దివ్య వచ్చి భరణికి సపోర్టుగా మాట్లాడటం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసింది. అటు వీకెండ్‌ ఎపిసోడ్‌లో డెమోన్ పవన్‌ను బయటకు వెళ్లిపోవాలని హోస్ట్ నాగార్జున చెప్పడం ఆసక్తికరంగా మారింది.