Breaking News

9 రోజుల్లో రూ.509 కోట్లు.. బాక్సాఫీస్ ఊచకోత

0 0

రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాగా.. తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది.కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 509 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా నిలిచింది. ఈ జాబితాలో రూ.600 కోట్లతో బాలీవుడ్ మూవీ ఛావా నంబర్ వన్ స్థానంలో ఉంది.

ప్రస్తుతం థియేటర్లలో మరో పోటీ మూవీ లేకపోవడంతో కాంతార మూవీ హౌస్‌ఫుల్ థియేటర్లలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగి, రానున్న రోజుల్లో ఇంకెన్నో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని… త్వరలోనే ఛావా రికార్డును దాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.