Breaking News

విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

0 0

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయ్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం విజయ్ దేవరకొండ స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు.