సుదీర్ఘ విరామం తర్వాత మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. మైథలాజికల్ కథతో తెరకెక్కిన కన్నప్ప థియేటర్లలో జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఓ మోస్తరు విజయం దక్కించుకుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై 7 వారాలు దాటినా రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. తాజాగా కన్నప్ప మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించారు.

