దేశవ్యాప్తంగా భర్తల మరణాలు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో ఏకంగా 785 మంది భర్తలు భార్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని వివాహం తర్వాత భార్యలు తమ అసలు రూపం బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ నేర రికార్డుల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాలలో మొదటి స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో యూపీలో 45 మంది భర్తలు చనిపోయారు. 2021లో ఈ సంఖ్య 52కి చేరుకుంది. 2022లో 60కి చేరుకుంది. 2023లో 55కి చేరుకుంది. 2024లో 62కి పెరిగింది. బీహార్ రాష్ట్రంలో 2020లో 30, 2021లో 35, 2022లో 40, 2023లో 39, 2024లో 42 మంది భర్తలు చనిపోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 20, 2021 సంవత్సరంలో 25, 2022 సంవత్సరంలో 28, 2023 సంవత్సరంలో 30, 2024 సంవత్సరంలో 35 మంది భర్తలు హతమయ్యారు. మహారాష్ట్రలో 2020 సంవత్సరంలో 15, 2021లో 18, 2022 లో 20, 2023లో 22, 2024లో 25 మంది భర్తలు తమ ఊపిరి కోల్పోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్యల చేతిలో మట్టిలో కలిసిపోయారు.
